
Sharwanand wife: ప్రస్తుత చిత్ర పరిశ్రమ లో చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసుకునే విషయంలో వెనకాడుతున్నారు. అయితే అలాంటి వారిలో రెబల్ స్టార్ హీరో ప్రభాస్ వయసు మీద పడుతున్నప్పటికీ ఇంకా పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాడు. గత కొంత కాలంగా హీరో ప్రభాస్ పేరు చెప్పుకున్నటువంటి కొంతమంది యువ హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా వరుసలో ఉన్న వారిలో నిఖిల్ సిద్ధార్థ్, నితిన్ పెళ్లి పీటలు ఎక్కగా ఇప్పుడు మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ కూడా పెళ్లి పీటలేకపోతున్నాడు.
ప్రస్తుతం ఈయన పెళ్ళికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శర్వానంద్ ఇంస్టాగ్రామ్ వేదికగా తను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు రక్షిత అని మీ అందరి ఆశీర్వాదం కావాలి అంటూ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంలోనే శర్వానంద్ భార్య గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నరు. అయితే ఆమె ఏమి చదివిందని, ఎక్కడ నివసిస్తుందని ఆమె ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ ఏంటని ఆస్తి విలువ ఎంతని ఇలా రకరకాల ప్రశ్నలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట. (Sharwanand wife)
Also read: వరాల జల్లులు కురిపించే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఎప్పుడూ మొదలు అవుతాయో తెలుసా మీకు?
అయితే హీరో శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి రక్షిత తెలంగాణ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాదు ఈమె చిత్తూరు జిల్లాలకు చెందిన టిడిపి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు అని తెలుస్తోంది.. బొజ్జల అల్లుడికి సొంత సోదరుడు మధుసూదన్ రెడ్డి. శర్వానంద్ కి కాబోయే మామ గురించి చూస్తే కనుక రాజకీయాల పరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు గొప్ప పేరు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగానే తెలుస్తోంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
Also read: LATEST TELUGU NEWS | అందగత్తె తో పెళ్లి అని మురిసిపోయాడు. పెళ్ళైన మూడో రోజే..!
Also read: Devotional Tips | అమ్మవారి పూనకం నిజమేనా?