Actress Meena|రెండో పెళ్ళిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మీనా:
Actress Meena:తెలుగు చిత్ర పరిశ్రమ లో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోయిన్ మీనా తెలియని వారు ఉండరు అని చెప్పవచ్చు. అయితే మీనా గురించి ఈ మధ్య కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అనారోగ్య కారణం తో ఆమె భర్త విద్యాసాగర్ మరణించారో అప్పటినుండి మీనా రెండో వివాహం గురించి సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విధంగా హీరోయిన్ మీనా(Actress Meena) రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మీనా ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి విషయం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.
అయితే ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి.ఇవి వాస్తవం కాదు డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఆమె అన్నారు.(Actress Meena)
ఇప్పటికే చాలా సార్లు తన రెండో పెళ్లి గురించి తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. ఆమె రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేడని అలాంటి ఆలోచన కూడా లేదని తెలిపారు. అయితే ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ మీనా(Actress Meena) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb