Ayodhya Surya Tilak | అయోధ్య లో అద్భుత దృశ్యం బాలరాముడికి సూర్య తిలకం:
Ayodhya Surya Tilak | అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.. అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత మొట్టమొదటి సారి శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.. తొలి సారి గా జరుగుతున్న ఈ వేడుకలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి రోజు అయోధ్య రామ మందిరంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన(Surya Tilak) సూర్య కిరణాలు తిలకంగా ప్రసరించాయి.
ఈ అద్భుతమైన ఘట్టం మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిని తాకాయి.బాలరాముని నుదురుపై కొన్ని నిమిషాల పాటు ఈ తిలకం కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాలను దేశ ప్రజలు టీవీ లైవ్ ద్వారా Ayodhya Surya Tilak వీక్షించారు.ఇక ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాన మంత్రి(PM Modi) నరేంద్ర మోదీ (PM Modi) సైతం ఈ అపురూప దృశ్యాలను తన ట్యాబ్‌లో లైవ్ ద్వారా వీక్షించారు.
అయితే ఈ అద్భుత ఘట్టానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసే అవకాశం తనకి లభించిందని ఎక్స్ వేధికగా చెప్పారు..అయితే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీరామ జన్మభూమి ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచే క్షణంగా అభివర్ణించారు.దేశ ప్రజలకు ప్రధాని రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి కృప వల్లే ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ మరియు సూర్య కిరణాలు తిలకంగా(Ayodhya Surya Tilak) చూడగలిగానని చెప్పుకొచ్చారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb