
Lavanya Tripathi: తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మెగా వారసుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ట్రాక్ నడిపిస్తున్న ఆయన.. ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
Also read: అందగత్తె తో పెళ్లి అని మురిసిపోయాడు. పెళ్ళైన మూడో రోజే..!
ఇక సెలబ్రిటీల బట్టలు, వాళ్లు వాడే వస్తువులపై.. అభిమానుల కన్ను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సెలబ్రిటీల ఇళ్ళలో ఏదైనా అకేషన్ ఉంటే చాలు.. ఇక తెల్లారి వారి గురించి.. వారు వాడిన వస్తువుల గురించి ఏదో ఒక న్యూస్ రావాల్సిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య (Lavanya Tripathi) నిశ్చితార్థంలో.. లావణ్య కట్టుకున్న పట్టు చీర ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తోంది.
Also read: అమ్మవారి పూనకం నిజమేనా?
అయితే ఈ చీరను లావణ్య త్రిపాతి కి అందించిన ఓ ఫ్యాషన్ డిజైనర్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ పట్టు చీర మెరిసిపోతుండగా లావణ్య ఇందులో మరింత అందంగా కనిపించింది. నెటిజనులు అయితే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చీరల ధరతో పోలిస్తే ఇది తక్కువే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిశ్చితార్థానికి 75 వేల రూపాయల చీర కట్టింది అంటే పెళ్ళికి కచ్చితంగా లక్ష రూపాయలు దాటుతుంది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also read: Indian Army Real heros | మెట్రో స్టేషన్లో ప్రెగ్నెంట్ మహిళా అసలేం జరిగిందో చూడండి.