Basikam | పెళ్ళిలో వధూ వరుల నుదుటన బాసికం ఎందుకు కడతారో తెలుసా:
హిందూ సంప్రదాయ పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి నుదుట సాధారణం గా కనిపించే వాటిలలో బాసికం(Basikam) ముఖ్యం గా ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి పెళ్లిలో వధువు వరుడికి నుదుటన బాసికం అనేది కనిపిస్తునే ఉంటుంది. అయితే బాసికం కట్టే పద్దతి పూర్వ కాలంలో నుంచి వస్తుంది. కానీ పూర్వ కాలంలో బాసికం కొంచెం పెద్ద సైజ్ లో ఉండేవి.
ఇప్పుడు ఆ సైజ్ ను తగ్గించి చిన్నవి బాసికం(Basikam) గా కడుతున్నారు. ఏది ఏమైనా సంప్రదాయం ప్రకారం బాసికం కట్టడం మాత్రం మానడం లేదు. బాసికం కట్టడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పూర్వ కాలంలో హిందూ సంప్రదాయం, ఆచారం పేరుతో వధువు, వరుడి నుదటన బాసికం కట్టే వారు అయితే దాని వేనుక సైన్స్ కు సంబంధించిన లాభాలు కూడా ఉన్నాయి.
మానవ శరీరం లో మొత్తం 72 నాడులు ఉంటాయి. వాటిలో 14 నాడులు చాలా ముఖ్యమైనవి. అయితే ఈ 14 లో కూడా పింగళ, సుషుమ్న, ఇడ వంటి నాడులు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిలో సుషుమ్న అనే నాడికి ఎడమ వైపు చంద్ర నాడి అలాగే కుడి వైపు సూర్య నాడి ఉంటుంది. ఈ సూర్య నాడి, చంద్ర నాడి రెండు కూడా శరీరం తల భాగంలో నుదుటన ఉంటాయి. సరిగ్గా అదే ప్రదేశం లో బాసికం(Basikam) కడుతారు. దీనితో ఆ నాడి లకు చాలా మంచి జరుగుతుంది.
అలాగే చంద్ర నాడి, సూర్య నాడి రెండు కలిసిన చోట అర్థ చంద్రాకారంలో ఉంటుంది. దీన్ని ఋషులు దివ్య వక్షవు అనే అంటారు. ఈ దివ్య వక్షవు వద్ద బాసికం కడితే దిష్టి తగలదని నమ్ముతారు. అలాగే అక్కడ బాసికం కట్టడం వల్ల ప్రమాదాలు, అశుభం కలగదని నమ్మకం. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి వేడుకలలో పెళ్లి కూతురుకు, పెళ్లి కుమారుడికి నుదుట భాగం లో ఉండే దివ్వ వక్షవు వద్ద అర్థ చంద్రకారం, లేద త్రిభుజ ఆకారం లో గల బాసికం కడుతారు.Basikam
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb