హీరో సిద్ధార్థ్, అదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పలు సందర్భంగా వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ ‘మహా సముద్రం’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమ చిగురించింది.హీరో శర్వానంద్ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లారు.అయితే నిన్నటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.లంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీరంగనాయకస్వామి ఆలయంలో ఈ ఉదయం వీరి వివాహం జరిగింది.
సిద్ధార్థ్, అదితి వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహం రహస్యంగా జరిగింది. మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా గుడిలోకి రానివ్వలేదు. పెళ్లి కార్యాన్ని కేవలం పురోహితులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి నిర్వహించారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితీరావు హైదరీ ఒకరు. ఈమె తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
అదితి, సిద్దార్థ్ లు తీసుకున్న సెల్ఫీ ఫోటోని అదితి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో అదితి, సిద్దార్థ్ లు కొత్త ఉంగరాలతో ఉన్నారు. అయితే ఈ ఫోటోని షేర్ చేస్తూ అదితి.. అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్ అని పోస్ట్ చేసింది. అదితి, సిద్దార్థ్ ల జంట నిన్న కేవలం నిశ్చితార్థం చేసుకున్నారని, పెళ్లి కాదని క్లారిటీ వచ్చింది.
అయితే మొత్తానికి దాదాపు మూడేళ్ళుగా సాగుతున్న ప్రేమని నేడు అధికారికంగా చెప్పేసింది అదితి. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఫోటో వైరల్ అవ్వగా అభిమానులు, పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb