Neha Sharma | లోకసభ ఎన్నికల భరిలో చిరుత సినిమా ‘నటి’:
Neha Sharma | నేహాశర్మ, హీరో రాంచరణ్- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బీహార్ భామ .. అయితే ఈ భామ మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. చిరుత మూవీలో ఈ అమ్మడు చాలా చక్కగా నటించింది. ఈ భామ లేడీ విలన్ స్థాయిలో రెచ్చిపోయింది. మొదటి చిత్రమే హిట్ అయిన వెంటనే ఈ ముద్దుగుమ్మ కి వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది.
అయితే ఆ టైంకి హీరో వరుణ్ సందేశ్ ఫామ్ లో ఉన్నాడు. అయితే ఆ మూవీ పెద్దగా ఆడకపోయేసరికి నేహాశర్మకు ఆఫర్లు కరువయ్యాయి.నేరుగా బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది కానీ నేహా శర్మ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఈ భామ తర్వాత తమిళ్, పంజాబీ సినిమాల్లో కూడా నటించినా ఏమి లాభం లేకపోయింది. ఇప్పుడు ఈమె ఆఫర్ల కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది. సోషల్ మీడియా వేధిక గా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె(Neha Sharma) ఫాలోవర్స్ కు మంచి కిక్ ఇస్తుంది.
అయితే ఈ ముద్దు గుమ్మ (Neha Sharma) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections 2024) పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నేహాశర్మ(Neha Sharma) ను బిహార్ (Bihar) నుంచి బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్ నేత అజిత్ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం పై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ”బిహార్‌లోని భగల్పుర్ లోక్‌సభ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.
‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు మా పార్టీకి వస్తే.. నేను పోటీ చేయడం లేదా నా కుమార్తె నేహాశర్మను బరిలోకి దించాలని భావిస్తున్నా. దీనిపై పార్టీని సంప్రదిస్తున్నా. తుది నిర్ణయం హైకమాండ్‌దే” అని భగల్పుర్ ఎమ్మెల్యే అజిత్ శర్మ వెల్లడించారు.బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb