
summer time: వేసవి కాలం వచ్చేసింది అందరికీ వచ్చే ఇబ్బంది, డిహైడ్రేషన్ వేసవి కాలంలో మన శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవాలి. శరీరానికి వాటర్ పర్సన్ సరిగా ఉండేలా చూసుకోవాలి .వేసవి కాలంలో చెమట యూరిన్ రూపంలో వాటర్ బయటికి పోయాక శరీరానికి సరిపడా వాటర్ పర్సెంట్ ఉందో లేదో చూసుకోవాలి .వాటర్ పర్సెంట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మన నోట్లో లాలాజలం ఊరుతుందో లేదో చూసుకోవాలి.
నోరు ఎండిపోకూడదు. పెదాలు ఎండిపోకూడదు .వాటర్ పర్సెంట్ తగ్గకూడదు. అంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. రాత్రిపూట పడుకున్నప్పుడు ఒంట్లో నీటి శాతం ఫ్యాన్ గాలికి చెమట రూపంలో ఆవిరి అయిపోతుంది .పొద్దునే లేవగానే యూరిన్ కూడా వెళ్లలేము. అందుకే ఉదయం లేవగానే నీళ్లు తాగాలి. మళ్లీ ఒక గంట తర్వాత లీటర్ నీటిని తాగాలి. ఈ నీరు శరీరానికి సరిగ్గా అందుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెండు గంటల వరకు నీరు తాగకూడదు .
మధ్యాహ్నం భోజనం చేసేవారికి మూడు నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి .మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు గంటల వరకు నీళ్లు తాగకూడదు మళ్లీ సాయంత్రం వరకు మూడు నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరానికి సరిపడా నీరు అందుతుంది .ముఖ్యంగా నోరు ఎండిపోకుండా చూసుకోవాలి. నోరు ఎండిపోయింది. అంటే వాటర్ పర్సన్ తగ్గినట్టే వాటర్ తగ్గితే బాగా దహమేస్తుంది కళ్ళు తిరుగుతాయి. బీపీ తక్కువ అవుతుంది. అందుకే నీళ్లు సరిపడా తాగాలి.