
పల్లెటూర్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో బచ్చలకూర కనబడుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బచ్చలకూరలో రెండు మూడు రకాలు ఉన్నప్పటికీ తీగ బచ్చలి కూరను పెంచుకోవడం మంచిదే ఈ తెంపుతున్న కొద్ది పెరుగుతుంది. 100 గ్రా తీసుకుంటే దాంట్లో 19 కిలో క్యాలరీలు శక్తి ఉంటుంది. కూరగాయలలో 30 ,40 క్యాలరీల శక్తి ఉంటుంది .
ఆకుకూరలలో 19 20 క్యాలరీలో శక్తి ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ నాలుగు గ్రాములు, ప్రోటీన్స్ రెండు గ్రాములు ఫ్యాట్ 300 మిల్లీగ్రాములు ఉంటాయి. ఐరన్ 1.5 మిల్లీగ్రా మ్స్ ,విటమిన్ సి 102 మిల్లీగ్రామ్స్, ఫోలిక్ యాసిడ్ 104 మైక్రో గ్రామ్స్ ఉంటుంది. విటమిన్స్ సి ఎక్కువగా ఉండడం వల్ల యూరినర్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది .
అలాగే రక్తహీనత ఉన్నవారికి రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో కెరోటిన్ పదార్థం ఉండడం వల్ల కంటి చూపుకి బాగా పనిచేస్తుంది .నాన్ వెజ్ తినే వారికి హార్ట్ ఎటాక్ కాకుండా బచ్చల కూర బాగా ఉపయోగపడుతుంది. ఆ రోజుల్లో కంద బచ్చలి బాగా వండేవారు అలాగే పప్పు వేసి కూడా వండుకోవచ్చు. బచ్చల కూర రోజు తినే ప్రయత్నం చేయండి.