
Nithyamenon: నిత్యామీనన్ నేచురల్ స్టార్ నాని నటించిన “అలా మొదలైంది” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. . ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ చిన్నది. తెలుగు, మళయాళంతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తోంది నిత్యా.
రీసెంట్గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో చేసింది. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఈ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు నిత్యామీనన్ పలు ప్రాజెక్టులతో బీజీ గా ఉంది. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో నిత్యా జడ్జీ గా వ్యవహరిస్తోంది.
Also read: Vedam movie | అల్లుఅర్జున్ “వేదం” సినిమాలో “కర్పూరం” పాత్ర వెనకాలఇంత కధ ఉందా..!
ఇక, అసలు విషయానికి వస్తే.. అయితే నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది నటులు క్యాస్టింగ్ కోచ్ పై స్పందించిన విషయం తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు మీడియా ముందు, పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఈ ముద్దు గుమ్మ ని తమిళ పరిశ్రమలో ఒక హీరో ఇబ్బంది పెట్టాడు.
Also read: వాటర్ ఫిల్టర్ లాగా పనిచేసే ఈ ముక్క ఎంటో తెలుసా?
అసభ్యంగా తాకుతూ సరిగ్గా ప్రవర్తించలేదు. తన ప్రవర్తన కారణంగా షూటింగ్ కూడా సరిగ్గా చేయలేకపోయాను. అసలు ఇలాంటి వాతావరణంలో మహిళలు అస్సలు పని చేయలేరు. అందుకేనేమో ఈ రోజుల్లో మహిళలు బయటికి వెళ్లి పని చేయడానికి భయపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు నిత్యా మీనన్.అయితే నిత్యామీనన్ నటించిన ఆ తమిళ చిత్రాల్లో ఏ హీరో అయి ఉంటాడని నెటిజన్లు సందేహంలో పడ్డారు. కానీ నిత్యామీనన్ మాత్రం తన పేరు చెప్పుకు రాలేదు. (Nithyamenon)

Also read: ఇవి పాటించండి….ఇక మీకు ఇబ్బందులు ఏ మీ దరిచేరవు.