
Gopika Govind: ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదగాలి అనే కోరిక ఉంటుంది. అయితే కోరిక ఒక్కటే చాలదు దానికి తగ్గట్టు పట్టుదల కృషి ఉండాలి. అయితే మాట్లాడుకోబోయే యువతీ పేరు గోపిక గోవింద్. ఈమె ఒక గిరిజన కుటుంబానికి చెందిన అమ్మాయి. గోపిక గోవింద్ చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ కావాలని కల ఉండటంతో మొత్తానికి ఆ కల ను నెరవేర్చుకుంది.. ఆమె 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలన్న కోరిక పుట్టిందని కానీ వారి కుటుంబ సభ్యులు పేదవాళ్లు.ఇక వాళ్ళ జీవనం విషయానికి వస్తే అటవీ భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేసి పొట్ట నింపుకుంటారు.
Also read: ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నవారే ఈ వీడియో చూస్తాడు.
ఇప్పుడు, అప్పుడు ఉన్న పరిస్తితుల్లో నిజానికి పేద పిల్లలు తమ స్థాయిని చూసుకొని అతిగా చదువుకోవాలన్న కోరిక పెంచుకోరు. గోపిక గోవింద్ మాత్రం తన పరిస్థితులను లెక్క చేయకుండా కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంది. అలా గోపిక గోవింద్ బిఎస్సి వరకు చదివి ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ద్వారా స్కాలర్షిప్ అందుకుంది. ఆమె పట్టుదలతో హిందీ, ఇంగ్లీష్ భాషలను కూడా నేర్చుకుంది.
Also read: Sharwanand wife | శర్వానంద్ భార్య ఆస్థి ఎంతో తెలుసా?
ఎంతటి పట్టుదల ఉన్న కొన్ని సార్లు లైఫ్ లో కొన్ని సార్లు నిరాశ పడాల్సి వస్తది, అయితే గోపిక గోవింద్ తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొనగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత మళ్లీ కష్టపడి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా ఎంపికయింది. తన 12 ఏళ్ల వయసులో ఎగురుతున్న విమానం చూసి విమానంలో విధి నిర్వహణ చేయాలని కల గన్న గోపికా గోవింద్ తన కలను నెరవేర్చుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆమె సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(Gopika Govind)
Also read: వరాల జల్లులు కురిపించే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఎప్పుడూ మొదలు అవుతాయో తెలుసా మీకు?
