
మనందరికీ ఈమధ్య జలుబు దగ్గు జ్వరం ఇవన్నీ వస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ వచ్చినప్పుడు కొంతమందికి కరోనా వైరస్ కూడా వస్తుంది. ఈ వైరస్ వచ్చినప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు .ఆంటిబయాటిక్స్ వాడారు ఇలా యాంటిబయోటిక్స్ వాడకుండా మన శరీరంలోనే ఆంటీ బాడీస్ ని తయారు చేసుకునేలా వైరస్ వచ్చిన దాని నుండి మనం కాపాడుకునేలా శరీరాన్ని తయారు చేసుకోవాలి.
జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు మనం చేయవలసిన పని మొదటగా లంకనం పెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు పొద్దున్నే లేవగానే గోరువెచ్చట నీటిని తాగాలి. అలా రెండు లీటర్ల నీటిని 9 గంటల వరకు తాగాలి. నీళ్లు బాగా తాగడం వల్ల మోషన్ ఫ్రీగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక గ్లాసు నిమ్మరసంలో నాలుగైదు స్పూన్ల తేనె కలుపుకొని తాగాలి. దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ మిర్యాల పౌడర్ వేసుకొని తాగాలి. ఇలా మధ్యాహ్నం వరకు రెండు మూడు సార్లు తాగాలి తేనె కలుపుకొని తాగడం వల్ల ఎనర్జీ వస్తుంది. ఇలా సాయంత్రం వరకు నాలుగైదు సార్లు తాగాలి.
మధ్యలో నీళ్లు కూడా తాగాలి. ఇలా తాగినప్పుడల్లా గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా రెండు రోజులు చేయడం వల్ల మీకు జ్వరము జలుబు తగ్గుతుంది. అలాగే శ్వాస తీర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టేటప్పుడు అందులో తులసి ఆకులు ,పసుపు , యూకలిప్టస్ఆయిల్ వేసి ఆవిరి పట్టడం వల్ల మీకు ముక్కు గొంతు ఫ్రీగా అవుతుంది. ఇలా రెండు రోజులు చేయడం వల్ల మీకు జ్వరం తగ్గి ఆకలి అనిపిస్తుంది. అప్పుడు ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ గాని ఫ్రూట్ జ్యూస్ తాగాలి. మధ్యాహ్నం పండ్లు తినాలి. మళ్లీ సాయంత్రం జ్యూస్ తాగాలి. ఇలా చేయడం వల్ల బాడీలో యాంటీ బాడీ ఏ వైరస్ వచ్చిన వాటి నుండి మనల్ని కాపాడుతుంది.