
Turmeric Benefits: పసుపు గురించి తెలుసుకుందాం. మొదటగా పసుపుకు ఉన్న గొప్ప గుణం ఇది క్రిమిసంహారిణి గా పనిచేస్తుంది. అలాగే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లామినేషన్, ఇలా అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి పసుపుకి మన పెద్దవారు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఋషులు కూడా పసుపు వల్ల లాభాలు ఏనాడో చెప్పారు.
కానీ మనం ఋషులు చెప్పింది చెవిన పెట్టము సైంటిఫిక్ గా సైంటిస్టులు చెప్పిందే వినేస్థితిలో ఉన్నాం. పసుపుని కొంచెం పేస్టు లాగా చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ కి చాలా గ్లో వస్తుంది. మన పెద్దవాళ్లు గడపలకు పసుపు రాస్తారు, ఎందుకంటే ఏమైనా క్రిములు, కీటకాలు ఇంట్లోకి వస్తే అవి పసుపు వాసనకి దూరమెల్లిపోతాయి. ఇంట్లోకి రావు. అలాగే పెళ్లిలు జరిగేటప్పుడు పెళ్లికొడుకు, పెళ్లికూతురికి, వంటి నిండా పసుపు రాస్తారు.
ఎందుకంటే వచ్చిన వారు తమని తాకినప్పుడు వాళ్ళ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి రాకుండా ఉంటుంది మరియు చర్మానికి గ్లో వస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇప్పుడైతే అన్ని శానిటైజర్లే. దద్దుర్లు వచ్చినప్పుడు పసుపు రాసుకుంటే వెంటనే తగ్గుతాయి. ఒక పసుపు ముద్దను తింటే కడుపులో ఉన్న క్రిములు కీటకాలని వెంటనే చస్తాయి. పసుపుకున్న ఇంకొక ముఖ్య గుణం ఏంటంటే ఇది క్యాన్సర్ కణాలను వేగంగా వ్యాప్తించకుండా, పసుపు తగ్గిస్తోంది. అందుకే పసుపును యాంటీ క్యాన్సర్ గాను అన్నారు. ఇంకా ఎన్నో లాభాలు పసుపు వల్ల ఉన్నాయి.