
Sukanya-samriddhi-yojana2
Sukanya samriddhi yojana|ఆడపిల్లల పెళ్లికి టెన్షన్ వద్దు:
Sukanya samriddhi yojana:ఒక కుటుంబంలో ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు మొదటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఆడపిల్ల చదువు నుంచి వివాహం వరకు పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారు ముందుగానే ఆర్థికంగా ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే అలాంటి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ పథకాలలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ప్రస్తుతం బాలికల విద్య, పోషణ, పోషకాహారం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది.
అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే సుకన్య సమృద్ధి యోజన భారత ప్రభుత్వం అందించే ప్రసిద్ధ పథకాలలో ఒకటి. ఆడపిల్ల ను కలిగా ఉన్న ఒక కుటుంబం ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం ముందస్తు పొదుపు చేసుకునే విధంగా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇదొక వరం(Sukanya samriddhi yojana). అయితే ఈ పథకం ద్వారా చిన్నప్పటి నుంచి ఖాతా తెరిచి డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ చివరి లో భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడం ఎలా?
ఆడపిల్ల భవిష్యత్తు కోసం చేసే ఈ పొదుపు (సుకన్య సమృద్ధి యోజన) ఖాతాను దగ్గరలోని పోస్టాఫీసు లేదా ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులలో తెరవవచ్చు. అయితే ఈ ఖాతా తెరవడానికి జనన ధృవీకరణ పత్రం, చిరునామా కార్డ్ మరియు గుర్తింపు కార్డ్ తో బ్యాంకులో ఫారమ్‌ను నింపి దరఖాస్తును సమర్పించవచ్చు. ఫారం ధృవీకరించబడిన తర్వాత మీ యొక్క ఖాతా తెరవబడుతుంది.
ఈ పథకం లో సంవత్సరానికి కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ. మీరు రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ ఖాతా ను ఆడపిల్ల పేరు మీద తెరవాలి. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిల పేరుతో గరిష్టంగా తెరవవచ్చు. ఇక ఖాతా గరిష్టంగా ఒక్కో చిన్నారికి ఒక్క ఖాతా మాత్రమే తెరవబడుతుంది. ఒక పిల్లవాడు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఖాతా తెరవడానికి అర్హులు.
అయితే ఖాతా తెరిచిన తర్వాత, డబ్బును వరుసగా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాలి. ఈ పథకం(Sukanya samriddhi yojana) లో మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు. అంటే మీరు ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత మొత్తం సొమ్ము మీ చేతికి అందుతుంది.ఇక బిడ్డకు 10 ఏళ్లు నిండిన తర్వాత, ఆమె స్వయంగా తన ఖాతాను నిర్వహించవచ్చు. ఆమెకు 18 సంవత్సరాలు నిండినప్పుడు. 50% డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
అయితే మీరు ఈ పథకం(Sukanya samriddhi yojana)లో సంవత్సరానికి కనీసం రూ.250. ఒక సంవత్సరంలో కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే, కాలపరిమితి అయిన తర్వాత ఎక్కువ రాబడిని పొందుతారు. ఒకవేళ మీరు సంవత్సరంలో 60,000 పెట్టుబడి పెడితే ప్రతి నెలా ఐదు వేల చొప్పున జమ చేయాల్సి వస్తుంది. సుమారుగా మీరు 15 ఏళ్లలో 9 లక్షలు జమ చేయవచ్చు..
మీరు ఇలా పెట్టుబడి పెడితే, వడ్డీ మొత్తం రూ. 17,93,814 గా వస్తుంది. ఇంకో 6 సంవత్సరాల తర్వాత అంటే మీ కుమార్తెకు 21 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి మీరు పొందే మొత్తం రూ. 26,93,814 గా వస్తాయి. ఇంకెందు ఆలస్యం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంక్ ను సంప్రదించండి..
