
ముందుగా ఆ ఫోటో గుర్తు పట్టరా.? దాదాపు మీరు గెస్స్ చేసింది నిజమే. s.s.రాజమౌళి ఇప్పుడు ఎటు చూసిన ఆయన పేరే కనపడుతుంది మరియు వినపడుతుంది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు తో సర్వత్రా ఆయన పై ప్రశంసలు కురుస్తున్నాయి. పెద్ద పెద్ద తారలు, పలువురు ప్రముఖులు రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇక రాజమౌళి మనకు డైరెక్టర్ గానే తెలుసు.. అది సీరియల్స్ వల్ల అయితేనేమీ సినిమాల వల్ల అయితేనేమీ! కానీ ఆయన లెక్కల ప్రకారమే లు తీస్తారని అందరికీ తెలుసు.
ఇక ఆయన సినిమా కలెక్షన్ ల వల్ల కూడా ఆయన మనకి తెలుసు. రికార్డు లు బద్దలు కొట్టడం లో కూడా ఆయన దిట్ట. రాజమౌళి బుల్లి తెరమీద నంచి..వెండితెర మీదికి వెళ్లి అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువే పర్సెంట్ సక్సెస్ సాధించారు. ప్రతి ఒక్కరికీ ఒక స్టైల్ ఉంటుంది. ఇక ఆయన స్టైల్ ఏంటి అనే విషయానికి వస్తే..
అది ఒక అద్భుతం, కేవలం పెద్ద విజువల్స్, ఊపిరి పీల్చుకునే ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్. అందరి ఉద్దేశ్యం ప్రకారం అతను సినిమా తీసే విధానం చేసే పని పట్ల ఉన్న అంకితాభావం. ఆయన తీసిన సినిమాలు థియేటర్లో కూర్చొని పెద్ద స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు మిమ్మల్ని మరో లోకం తీసుకుపోవడమని నేనకుంటాను. సినిమా విషయంలో అతను చాలా హార్డ్-కోర్ లేదా పూర్తిగా భావోద్వేగాన్ని ప్రదర్శిస్తాడు.
అతను తన కథ చెప్పడంలో అసలు తగ్గడు. ఇక ఆయన RRR విడుదల తర్వాత అతను తాజా విజువల్ ఎఫెక్ట్స్ యొక్క సాంకేతిక నిపుణులతో చాలా సమయం గడిపి ఉంటారేమో. కాబట్టి ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని చిత్రాలకు ఆర్ఆర్ఆర్ నిజంగా బాప్ అయింది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఆ ఫోటో మీకు అర్దం అయ్యే ఉంటది ముందే. ఆయన ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి.
