
ఆర్య మూవీ గుర్తుందా? ఫీల్ లవ్ అంటూ అందరికీ ఎంతగానో నచ్చిన ఆర్య లాంటి హిట్టు మూవీ చేసి అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎదిగి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కానీ ఆ మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనురాధ మెహతా అలియాస్ అను మెహతా. ఈ ముద్దు గుమ్మ మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. ఆర్య సినిమా తో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఆమె తెలుగు ఆడియెన్స్ ను తన లవ్ లో పాడేసుకున్న అను మెహతా. ఆ తర్వాత ఆమె మూవీ సెలక్షన్స్ లో పొరపాట్లు చేసింది. ఈ భామ ఆర్య హిట్ తర్వాత స్టార్ సినిమాలు ఏమి చేయలేదు. ఇండస్ట్రి లో అవకాశాలు రాలేదో లేక వచ్చినా చేయలేదో తెలియదు కానీ ఈ ముద్దు గుమ్మ అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ కలిసి నటించిన నువ్వంటే నాకిష్టం సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడు ని ఆ మూవీ ఫలితం నిరాశపరిచింది.
అనురాధ మెహతా తర్వాత ఒక కన్నడ మూవీ చేసినా అది పెద్దగా హిట్ అయినట్టు లేదు. ఈమె తెలుగులో మహారాజశ్రీ, వేడుక సినిమాలు చేయగా ఆ సినిమాలలో కూడా అను మెహతా తన మార్క్ చూపించలేకపోయింది. అను మోడల్ గా అలరించి హీరోయిన్ గా 18 ఏళ్లలో కేవలం ఐదారు సినిమా లు మాత్రమే చేసి అడ్రెస్ లేకుండా పోయింది. అయితే అల్లు అర్జున్ లాంటి హీరోతో సినిమా చేశాక అమ్మడి కెరియర్ పీక్స్ లో ఉంటుందని ఆశించారు కానీ అలా జరుగలేదు.
ఈ ముద్దు గుమ్మ స్కిన్ షో, గ్లామర్ షో, లిప్ లాక్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలని భావించి బహుశా సినిమాలు చేయడం మానేసిందని కొందరు అంటున్నారు. అప్పట్లో ఆర్య సినిమా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్. ఆ మూవీ హీరోయిన్ గా చేసిన అనుని అందరు గుర్తు పెట్టుకుంటారు. అను మెహతా ప్రస్తుతం ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ భామ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినా ఆర్య ఇమేజ్ తో కెరియర్ లాగించేయొచ్చు అని కొందరు సలహా. ఈ అమ్మడు తిరిగి రావాలి అని ఎందరు కోరుకుంటున్నారు.