Shanthi swaroop: ఈటీవి లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటీనటులు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వారిలో లేడీ గెటప్ వేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు శాంతిస్వరూప్. ఆయన ఆది స్కిట్ లో లేడీ గెటప్ లు వేసి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తాజాగా శాంతి స్వరూప్ ఒక కారును కొనుగోలు చేశారు.
అయితే ఈ సందర్భంగా శాంతి స్వరూప్ తనతో షో లో వర్క్ చేసిన…సహ నటులు లేడీ గెటప్ లు వేసిన కొంతమంది తన స్నేహితులు తనను అవమాన పరిచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి స్వరూప్ గతంలో నా కలల కారు అంటూ యూట్యూబ్ లో ఓ వీడియోని పెట్టానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియోను డిలీట్ చేశానని దానికి కారణం ఇప్పుడు చెబుతానని అన్నారు.
అయితే ఆ కారు అతని కారు కాదని షూటింగ్ జరుగుతుండగా అక్కడ ఒక కారు కనిపిస్తే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుస్కోవడానికి అని తన కారు అన్నట్టుగా వీడియో తీసానని చెప్పారు. ఆ తరువాత ఆ వీడియో చూసిన ప్రేక్షకులు కంగ్రాట్స్ చెప్పారని కానీ కొంతమంది తనతో వర్క్ చేసేవాళ్లు..లేడీ గెటప్ లు వేసేవాళ్లే అతడిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధెకాకుండా అసలు కారును తాకే అర్హత నీకు ఉందా అంటూ తనను దారుణంగా అవమానించారని శాంతిస్వరూప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం శాంతి స్వరూప్ కారును కొనబోతున్నా అని కాబట్టి మాట్లాడే సందర్భం వచ్చింది అని అన్నారు. మాట్లాడే సందర్బంలో మీలాగా ప++ క్క లేసి…అడ్డదా రు ల్లో నేను డబ్బు సంపాదించలేదు. మీలా బంగారం నగలు కొనుక్కోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను మీలా చెడ్డ పనులు చేస్తే ఒక్కరాత్రిలో కార్లు, విల్లాలు కొనగలను అంటూ…. నేను మీలా అలాంటి తప్పులు చేయను అంటూ వ్యాఖ్యానించారు. తనను కించపరిచిన వారికి చెబుతున్నానని మీ దగ్గర ఉంటే అది మీ దగ్గర పెట్టుకోండి కానీ ఇతరులను కించపరచకూడదు అంటూ వ్యాఖ్యానించారు.