
Samyukta: కోలీవుడ్ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్లు ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ జంట పెళ్లి అయినా రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే నటి సంయుక్త భర్త విష్ణుకాంత్ పై సంచలన ఆరోపణలు చేసింది. నటి సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని అంటూ ఆమెకు గతంలో ఒక లవ్ స్టోరీ ఉందన్న విషయాన్ని అతనికి చెప్పలేదంటూ విష్ణు కాంత్ పెట్టిన ఆడియో వైరల్ అవడంతో సంయుక్తపై మొదట విమర్శలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో స్పందించిన నటి సంయుక్త నేను ఏ తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపిస్తోంది. విష్ణుకాంతే అడల్ట్ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, ఆమెతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చింది.. ఏకంగా బెడ్రూమ్లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని నేను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.
విష్ణుకాంత్ తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన విష్ణుకాంత్ నను తాను రక్షించుకోవడానికి నా మీద నిందలు మోపుతోంది. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలిగా అని ప్రశ్నించారు. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్ పెట్టానంటోంది. మరి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుంది అని అన్నారు.