
Saloni: మహారాష్ట్రలో జన్మించి చూడ్డానికి తెలుగమ్మాయిలా ఉండే కనిపించే ముద్దుగుమ్మ సలోని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దిల్ పరదేశీ హో గయా అనే హిందీ ద్వారా వెండి తెరకు 2003 పరిచయం అయినా ఈ భామ ధన 51 తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.
అడపా డదపా వచ్చిన అవకాశాలు ఆమెను నిరాశ పరిచాయి. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న లో హీరోయిన్గా నటించి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. అయినప్పటికీ ఇండస్ట్రి లో ఈ ముద్దుగుమ్మ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది.
ఈ ముద్దు గుమ్మ 1987 జూన్ 1వ తేదిన జన్మించింది. అయితే ఈ భామ నేటితో 36 ఏళ్లలోకి ఎంట్రీ ఇచ్చింది.సలోని ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ సలోనికి సంబంధించి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.