
మెగా ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీ నుండి శుభవార్త. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా వరుణ్ తేజ్ పెళ్లికి రంగం సిద్ధం తెలుస్తుంది. వరుణ్ తేజ్ రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయనున్నారట. వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారట..అయితే హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే..
ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రస్తుతం దేశం వెలుపలే ఉన్నారు. వీరిద్దరూ జూన్ 1న సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి వివాహ ప్రణాళికలకు సంబంధించి అధికార ప్రకటన అతి త్వరలో రాబోతుందని వినిపిస్తోంది. హీరో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు, అతని సోదరి నిహారికకు కూడా ఈ విషయం తెలిసినట్లు సమాచారం. అయితే వీరిడదరి పెళ్లి వేడుక కొణిదెల కుటుంబానికి స్పెషల్ కానుంది.
ఇక అసలు విషయానికి వస్తే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన అయ్యాక, ఆ రోజె వీరి వివాహం ఎప్పుడు జరగనుందని ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్ధం ఫంక్షన్ కి మెగా కుటుంబం నుండి అందరూ వచ్చే అవకాశం వుంది అని తెలుస్తోంది. ఈ వేడుకకు ముఖ్యంగా చిరంజీవి , సురేఖ దంపతులు, అలాగే రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి ఇద్దరు కుమార్తెలతో పాటు, అల్లు కుటుంబం కూడా హాజరవుతోందని తెలుస్తోంది.