
రంజాన్ అనేది ఎలాంటి పండగ దీని యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. రంజాన్ పండుగ అనేది ఈరోజు ఎందుకు చేయాలి. అంటే పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ఆవిర్భవించిన రోజు అందుకనే ఈరోజు రంజాన్ జరుపుకుంటారు. రంజాన్ అంటే శుభవేళ ఇంకా ఉత్సవ సమయం అంటారు అంటే ఈ రంజాన్ వచ్చే మాసాన్ని రంజాన్ మాసం అని అంటారు .
ఈ రంజాన్ మాసంలో ఈ నెల అంతా కటోర ఉపవాసం ఉంటారు .ఉదయం అంతా కటోర ఉపవాసం ఉంటూ లాలాజలం కూడా మింగకుండా ఉపవాసముండి రాత్రి వేళలో భోజనం చేశారు. ఇలా పన్నెండు గంటలు ఉపవాసం ఉండటం వల్ల బాడీకి మంచి రిపేరు క్లీనింగ్ జరుగుతుంది .ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే మంచి సేవా భావం కలుగుతుంది .ఆధ్యాత్మికత పెరుగుతుంది .
రంజాన్ మాసంలో దానధర్మాలు చేస్తారు. పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. సంవత్సరం అంతా రొటీన్ లైఫ్ తో ఉండి ఈ రంజాన్ మాసంలో కొత్త ఆలోచనలతో సేవా భావంతో ఉంటారు. రోజుకి ఐదు సార్లు మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకు ప్రశాంతత ఆధ్యాత్మికత పెరుగుతుంది .ఇలా ఒక నెలపాటు చేయడం వల్ల మనసులో మార్పు వచ్చి పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు .ఉపవాసం అనేది ఒక ముస్లిం లోనే కాదు హిందువులు క్రిస్టియన్స్ లో కూడా ఉంటుంది.