
అక్షయ తృతీయని శనివారం జరపాలా, ఆదివారం జరపాలా, అక్షయ తృతీయ అంటే ఏమిటి ?దీనిని ఎలా జరుపుకోవాలి .ఇది శుద్ధ వైశాఖ తృతీయ రోజు వస్తుంది. అక్షయ తృతీయ అంటే ఉన్నది రెట్టింపు అవడం ,ఏది కొన్న ఏ పని చేసిన రెట్టింపు అవుతుందని నమ్మకం. ఈరోజు అక్షయము అంటే వెనకటి రోజుల్లో పంచ పాండవులు అడవులలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళ వెంట ఉండి ద్రౌపది తోని వ్రతం చేయిస్తాడు. అప్పుడు సూర్యభగవానుడు వ్రతానికి మెచ్చి అక్షయపాత్రను ద్రౌపది దేవికి ఇస్తాడు.
అంటే వాళ్ళు అడవులలో ఉన్నారు కదా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తినడానికి ఆహార ధాన్యాలు లేవు కదా అని ఆహార ధాన్యాలు రెట్టింపడానికి అక్షయపాత్రను ఇస్తాడు .అలాగే ఈరోజు గంగాదేవి మహావిష్ణువు పాదాల మీద నుంచి కిందికి దిగిన రోజు గంగాదేవి జన్మించిన రోజును కూడా అంటారు. ఈ అక్షయ తృతీయ ఈ సంవత్సరం శుద్ధ వైశాఖ తృతీయ అనగా శనివారం రోజు ఉదయం ఏడు గంటల 57 నిమిషాలకి వస్తుంది. మరల మరుసటి రోజు ఆదివారం ఉదయం 7 గంటల 47 నిమిషాలకి వెళ్తుంది
అక్షయ తృతీయ రోజు ఎవరైనా ఏదైనా కొనాలన్నా ఏం చేయాలన్న శనివారం రోజు చేయవచ్చు. బంగారం కొనేవారు కొంటారు లేనివారు ఏదైనా దాన్యం కానీ పండ్లు కానీ ఏదైనా సరే దానం ఇవ్వండి .ఆదివారం రోజు రోహిణి నక్షత్రం వస్తుంది .కాబట్టి సూర్యోదయం కి ముందే తల స్నానం చేసి మహావిష్ణువుని తెల్ల జిల్లేడు పూలతో అలంకరించి జిల్లేడు వత్తులతో పూజించిన పూర్వజన్మల కర్మలు దహించి పుణ్యం ప్రాప్తిస్తుంది.