శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పవచ్చు.. శ్రీ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చెన్నైలో కూడా చాలా ఫేమస్. ఈమె నటి కావాలన్న కోరికతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. కానీ శ్రీరెడ్డికి సరైన అవకాశాలు లభించలేదు. అయితే ఈమె ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న మోసాల గురించి మీటూ ఉద్యమాన్ని ప్రేరేపించింది. శ్రీ రెడ్డి స్టార్ట్ చేసిన మీటు ఒక ఉద్యమంలా మారింది.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న నటీమణులు చిత్ర పరిశ్రమ లో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి దైర్యంగ బయట పెడుతున్నారు.
ఇండస్ట్రి లో శ్రీ రెడ్డి కూడా అవకాశాలు లేకపోయినా కూడా తరచూ సినీ ప్రముఖుల మీద రాజకీయ నాయకుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఈమె ఆదేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. యూట్యూబ్ చానెల్ లో హోమ్ టూర్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ తో పాటు కుకింగ్ వీడియోస్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది. శ్రీ రెడ్డి వంటలక్కగా మారిన తర్వాత ఆమె చేసే వంటల ద్వారా మాత్రమే కాకుండా తన అందాలతో కూడా వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అయితే తన చానెల్ ద్వారా ఇప్పటికే ఎన్నో రకాల వంటలను రుచి చూపించిన శ్రీరెడ్డి తాజాగా మరొక వంటకంతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక వేసవికాలంలో మామిడికాయ పచ్చడి చేస్తూ రెచ్చిపోయింది. అయితే శ్రీ రెడ్డి ఈ వీడియో లో మామిడికాయ పచ్చడి చేసే విధానం గురించి చెబుతూ మద్య మద్యలో డబుల్ మీనింగ్ డైలాగులతో కవ్వించింది. అవే కాకుండా మామిడికాయల వల్ల కలిగే ప్రయోజనాలు మామిడికాయ పచ్చడి చేసుకునే విధానం గురించి చెప్పుకొచ్చింది.
అయితే చాలా మంది యువత ఈ కాలంలో ఎంతో కష్టపడి ఎన్నో కష్టమైన కోర్సులు నేర్చుకుంటున్నారని మన సాంప్రదాయమైన ఆవకాయ పచ్చడి నేర్చుకోవడం పెద్ద కష్టం కాదని తెలిపింది. ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో మామిడికాయ పచ్చడి చేసి వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇస్తే వారు ఆనందిస్తారని తెలిపింది. ఇక ఆలస్యం ఎందుకు ఈ ముద్దు గుమ్మ చేసే మామిడికాయ పచ్చడి చూసేయండి.