
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ చూసి ఆనందించడం వేరు. కొన్ని సార్లు అదే హీరోయిన్స్ ఏవైనా అవార్డు ఫంక్షన్స్ లో లేదా ఈవెంట్స్ లో వారు చేసే స్టేజ్ పెర్ఫార్మన్స్ చూడటం వేరు అని చెప్పవచ్చు.. ఇక ఈ హీరోయిన్ అయిన సరే ఎంతటి స్టార్డమ్ వచ్చినా ఏదొక సమయం లో హీరోయిన్స్ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు.
అయితే ఈ మధ్యకాలంలో సూపర్ క్రేజ్ సంపాదించుకొని ఓ హీరోయిన్ ఒక అవార్డు ఫంక్షన్ లో స్టేజ్ పై డ్యాన్స్ అదరగొట్టింది. ఆ ముద్దు గుమ్మ ఎవరు అంటే పూజా హెగ్డే. అయితే గత ఏడాది కోలీవుడ్ లో బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుక జరిగింది. ఈ ఫంక్షన్ కి ఎంతోమంది స్టార్స్ అవార్డులు అందుకున్నారు. అయితే చాలా మంది వారి పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నప్పటికీ.. పూజా హెగ్డే చేసిన స్టేజ్ పెర్ఫార్మన్స్ ఎక్కువ హైలైట్ అయ్యింది.
ఈ నేపధ్యంలో పూజా స్టేజ్ పై చేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కి ముందు పూజ హెగ్డే డాన్సర్స్ తో కలిసి ప్రాక్టీస్ ఎలా చేసిందో వీడియో రిలీజ్ అయ్యింది. అయితే ఈ రిహార్సల్స్ వీడియోలో చూస్తే.. తోటి డాన్సర్స్ తో కలిసి పూజా ఎంతో కష్టపడింది. పూజ హెగ్డే కష్టాన్ని మనం ప్రాక్టీస్ వీడియోతో పాటు స్టేజ్ పెర్ఫార్మన్స్ లో కూడా చూడవచ్చు. ఇప్పడు పూజా స్టేజ్ పెర్ఫార్మన్స్ కి సంబంధించి ప్రాక్టీస్ చేసిన రిహార్సల్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంకా ఎందుకు లేట్ మీరు చూసేయండి.