కర్ర సాము అదరగొట్టిన జ్యోతిక .. ఇద్దరు పిల్ల తల్లి అయినా సరే హీరోలకి ధీటుగా కర్ర విన్యాసం .

ఒక కథానాయిక ఎందులోనూ తక్కువ కాదు అని ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి నిరూపించుకుంటున్నారు… మరి ముఖ్యంగా హీరోలకు సైతం అస్సలు తీసిపోరు అని మరోసారి నిరూపించింది నటి జ్యోతిక. ఇక ఈమె వేలమంది చూస్తుండగా ఆమె చూపించన టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు అని చెప్పవచ్చు.. ఈ నటి తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

జ్యోతిక, హీరోయిన్ నగ్మా చెల్లెలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇప్పుడు ఇండస్ట్రి లో ఆమెకంటూ ఒక ప్రత్యకమైన ఇమేజ్ ను సాధించుకుంది. ఈమే ప్రముఖ హీరో సూర్యను పెళ్ళి చేసుకుని హ్యాపీగా చెన్నైలో సెటిల్ అయిపోయింది. నటి జ్యోతిక వివాహం తరువాత నటనకు గుడ్ బై చెప్పి చాలా కాలం సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంది.ఈమె ఈ మధ్యకాలంలో నిర్మాతగా మారింది.

ఇప్పుడు జ్యోతిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూ మళ్ళీ మూవీస్ లో బిజీ అయింది.. ఈ మధ్య ఈమె ఒక స్టేజ్ పైన హీరోయిన్ గా మాత్రమే కాకుండా మల్టీ టాలెంటెడ్ గా నిరూపించుకుంది. నటి జ్యోతిక మరోసారి ఆడియన్స్ ను మరో టాలెంట్ తో ఆశ్చర్యపరిచింది. నటి జ్యోతిక 2020లో JFW మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరిగింది.

ఈమె మరోసారి ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన తమిళ తెలుగు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక కొంత మంచి అయితే కామెంట్ ల రూపంలో ఆమె పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లయినా సరే మంచి ఈజ్ తో కర్రసాము చేస్తోందని మెచ్చుకుంటున్నారు. కర్ర సాము ఎలా చేసిందో మీరు చూసి కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *