
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ఎన్నో మూవీస్ లో ఒక తల్లిగా, చెల్లిగా, పిన్ని, వదిన పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అలరింపజేశారు. సురేఖ వాణి తనదైన రీతిలో వివిధ మూవీస్ లో అద్భుతమైన పాత్రలలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు.
ఇక ఈమె జీవితంలో తన భర్త మరణం తర్వాత కొద్ది రోజులపాటు కృంగిపోయిన సురేఖ వాణి ఇప్పుడు తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే సురేఖ వాణి కూడా తన కూతురితో సమానంగా చిట్టి పొట్టి బట్టలు ధరిస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక్కటే కాదు ఆమె తన కూతురితో అప్పుడప్పుడు డ్యాన్సులు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉండేవారు..
ఇక ఆమె కూతురు సుప్రీతా తన డాన్స్ కూడా వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి రాకముందే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.. ఇది ఇలా ఉండగా తల్లి సురేఖ వాణి అలాగే ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఘనంగా సుప్రీతా పుట్టిన రోజు ను సెలబ్రేట్ చేశారు.ఆ వేడుక లో తల్లి సురేఖవాణి కూతురు సుప్రీత కి మందు తాగించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది..
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
అయితే ఇప్పడు ఈ పుట్టిన రోజుకి సంబంధించిన వీడియోలు , ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక తల్లి వై ఉండి కూతురికి మంచి హితబోధ చేయాల్సింది పోయి ఇలాంటి అలవాట్లు నేర్పిస్తావా అంటూ సురేఖ పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆమె కూతురు సుప్రీతా డ్రెస్ పై కూడా మరింత కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
