
నటుడు నరేష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు అనుకుంటా. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఆయన ఒక హాట్ టాపిక్ గా మారాడు. అయితే నటుడు నరేష్ నాలుగో పెళ్లి తెలుగు సిన్మా అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. నటుడు నరేష్ పవిత్ర వారి పెళ్లి, బంధం నిజమో కాదో ఇంతవరకు ఎవరికి తెలియరాలేదు.
కానీ సోషల్ మీడియా లో మాత్రం వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే వార్తల్లో నిజం లేదంటూ తాజాగా నరేష్ పిఆర్ టీమ్ క్లారిటి ఇచ్చింది. ఇక నరేష్ – పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకుంటున్నారన్నది ఒట్టి పుకారేనని తేల్చి చెప్పింది. ఈ విషయం పై హాట్ హాట్ గా పెళ్లి గురించి వార్తలు బయటికి వస్తున్నా పవిత్రా లోకేష్ మాత్రం స్పందించడం లేదు.
వారిద్దరూ గత కొన్నేళ్లు సహజీవనం చేస్తున్నట్టు సినీ ఇండస్ట్రి లో పెద్ద టాక్. ఇంతలోనే అభిమానులకు షాక్ ఇస్తూ.. వీళ్లిద్దరు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు.. అయితే వీళ్లిద్దరు సాంప్రదాయ బద్ధంగా ఒక్కటయ్యారు. ఈ పెళ్లి హైదరాబాద్లో ఎక్కడ జరిగిందేనది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంటూ తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ ట్విట్టర్ వేదికగా కన్ఫామ్ చేసారు. ఈ జంటపై మీ కామెంట్ ఏంటో మరి.