
నటుడు మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ గత కొన్ని రోజులగా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని నిజం చేస్తూ మనోజ్ భూమా మౌనికా రెడ్డిని మార్చి 3న ఘనంగా పెళ్లి చేసుకున్నారు మనోజ్. ఈ పెళ్లి తో హీరో మంచు మనోజ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హీరో మంచు మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డిని పెళ్లాడారు మనోజ్. ఈ వివాహ వేడుక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది.
అయితే ఈ వివాహం రాత్రి 8: 30 నిమిషాలకు కుటుంబ సభ్యుల తోపాటు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగనుంది. మంచు మనోజ్ సోదరి నటి మంచు లక్ష్మి ఇంట్లో హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఈ వేడుక జరగనుంది. అయితే తాజాగా మనోజ్ తన భార్య ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంచు మనోజ్ చేసుకోసుకున్న ఈమె ఎవరు.. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం..
భూమా మౌనికరెడ్డి మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గణేష్ రెడ్డి నుంచి ఆమె విడాకులు తీసుకుని భరణంగా అదే సమయంలో 250 కోట్ల రూపాయలను తీసుకుందని మరియు మౌనిక పేరుపైన కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అని సమాచారం. ఇక అవే కాకుండా ఆళ్లగడ్డ , కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలలో ఆమె పేరు పైన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరి ముఖ్యంగా భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవని సమాచారం.