
ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.వారిలో కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. . ఈయన బలగం మూవీ దర్శకుడిగా మారిన వేణు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌తో పాపులర్ అయ్యాడు. వేణు అంతకు ముందే సినిమాల్లో కమెడియన్‌గా నటించినప్పటికి జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
జబర్దస్ట్ లో వేణు వండర్స్ అనే పేరుతో టీమ్ కు లీడర్‌గా వ్యవహరించిన నవ్వులు పువ్వులు పండించాడు. అయితే ప్రస్తుతం ఉన్న గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ వేణు వండర్స్ టీంలోనే ఎదిగారు. జబర్దస్ట్ షోలో ఎన్నో హిట్ టాస్క్ చేసి బుల్లితెర ప్రేక్షకులను కడుబ్బా నవ్వించిన వేణు జబర్దస్త్ కామెడీ షో లో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. అయితే ఆయనకు ‘బలగం’.. చిన్న మూవీ గా విడుదలై పెద్ద విజయం సాధించింది..
ఈ సినిమా కి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ లో వేణు బలగం మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే ఘనవిజయం అందుకున్నాడు బలగం వేణు.. ఈ మూవీ ని కుటుంబ బంధాల విలువలపై చక్కగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ఘన విజయం సాధించడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ నుంచి బయటకి రావడానికి గల కారణాలను వివరించాడు.
వేణుకు కేవలం సినిమాల పై ఉన్న ఇష్టంతోనే జబర్దస్ట్ షో వదిలేశాను. ఇండస్ట్రి లో మొదటి నుండి నా లక్ష్యం సినిమానే. ఇక ఫుల్ టైం సినిమాల్లో రాణించాలనే కోరికతోనే జబర్దస్త్ షో ని వీడాను. ఆ షో లో నేను ఉన్నప్పుడు రేటింగ్ బాగుంది. నాకు మంచి రెమ్యూనరేషన్ వచ్చింది, అయినప్పటికీ సినిమాల కోసం జబర్దస్ట్ షో వదులుకొని బయటకు వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరి ఊహాలను తలకిందులు చేస్తూ మంచి విజయం సాధించింది.