
నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూ దూసుకుపోతోంది. అంతటి అందాల తార శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైన ఈ బ్యూటీ ఎదుటివారిని చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్, అబ్బరపరిచే యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును పొందింది.
అయితే తన తల్లి దివంగత నటి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ నటనతో అందచందాల విషయంలో కూడా అదరగొడుతోంది. జాన్వి కపూర్ లేటెస్ట్ మూవీ మిలి ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. తనకి సౌత్ భాషల్లో నటించాలనీ ఉందని తెలిపింది..అలా మాట్లాడుతూ తెలుగులో నటించాలనీ.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా చేయాలనీ ఉందని తెలిపింది. అయితే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టమని పేర్కోంది.
జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ ఒక్క మూవీ హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీ అయ్యింది. ఇక జాన్వీ తన తల్లి శ్రీదేవి లాంటి అందం మరియు లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.