
ఓ కోలీవుడ్ హీరోయిన్ తన ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్నది అతడి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె ఎవరో కాదు కోలీవుడ్ హీరోయిన్ అనికా విజయ్ విక్రమన్. చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించిన అనికా విజయ్ విక్రమన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తన ప్రియుడు చేసిన అఘాయిత్యాన్ని బయటపెట్టింది.
ఆమె ఇలా నేను గతంలో అనూప్ పిల్లే అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. అతడు ముందు బానే ఉన్నాడు.అంటూ తన మాజీ ప్రియుడు అనూప్ పిళ్లైపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రియుడు అనూప్ తనపై దాడి చేశాడంటూ గాయాల తాలుకూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అనికా విజయ్ విక్రమన్ అతడి నుంచి రక్షణ కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించగా..
అనికా షేర్ చేసిన ఫోటోస్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. ఆమె చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా అలరించి మెప్పించింది. అయితే ఆమె పై జరిగిన అఘాయిత్యాన్ని తన ఇన్ స్టా వేదికగా చెప్పుకొచ్చింది. అయితే అతడు ముందు బానే ఉన్నాడు, ఆ తరువాత అతని నుంచి నేను ఎంత దూరంగా ఉన్నా కూడా అతడు నన్ను వదలడం లేదు. అతను మొదటిసారి నన్ను కొట్టినప్పుడు పిక్స్ ఇవి.
నా ముఖం మొత్తం పగులకొట్టాడు. అలా జరిగిన తరువాత వెంటనే నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాడు. మొదటిసారి కదా అని క్షమించి వదిలేసా కానీ, మళ్ళీ ఇలా రెండోసారి కూడా అదే రిపీట్ అయ్యింది. రెండవ సారి జరగడం తో అతడి నుంచి దూరమయ్యాను. పోలీసులకు ఫిర్యాదు చేశా అయినా అతడి దగ్గర ఉన్న డబ్బుతో పోలీసులను మ్యానేజ్ చేశాడు అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
