
చరిత్ర పుటలు తిరగరాసిన తెలుగు సినిమా “RRR”. “RRR”మూవీ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచేసింది. ఈ సాంగ్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో పోటీపడి చివరకు ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. ఇక అవార్డు పొందిన “RRR” సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
దీనికంటే ముందే ఈ మూవీ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలవటంతో కచ్చితంగా ఆస్కార్ కూడా వస్తుంది అని భావించారు. అనుకున్న విధంగానే ప్రస్తుతం “RRR” నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచేసింది. ఈ అవార్డు కోసం వారం రోజులకు పైగానే “RRR” చిత్ర యూనిట్ అమెరికాలో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు అయింది.
దానితో పాటుగా పలు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఇక ఒక వైపు నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చేలా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ఆస్కార్ అవార్డు ప్రధాన ఉత్సవం జరుగుతున్న వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ లో భాగంగా “నాటు నాటు” పాటని పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ.
నాటు నాటు సాంగ్ విన్న ప్రముఖులు అంతా ఆనందంలో కరతాల ధ్వనులు కొట్టారు. “RRR” మూవీ కీ ఆస్కార్ అవార్డు రావటంతో భారతీయ చిత్ర ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ప్రశంసిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడుతున్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు “RRR” నాటు నాటు సాంగ్ సొంతం చేసుకుంది.