
తెలుగు ఇండస్ట్రి లో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే గత ఏడాది ఆయన హీరోగా నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తో ఆయన ఒక్కసారిగా పాన్ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తన అద్భుతమైన నటనతో వరుసగా అవార్డులు అందుకున్నాడు.

ఇప్పుడు అతని తదుపరి మూవీ ని దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15‘. ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు, మరియు ఈ చిత్రానికి దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ 80 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ మూవీ గురించి అభిమానుల్లో భారీ అంచనాలను వస్తున్నాయి. అయితే దానికి ముందు రాంచరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా RC15 టైటిల్ ప్రకటన ఉండబోతుందని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు.

అయితే మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్బంగా RC15 టైటిల్ లోగో లాంఛ్ చేసేందుకు శంకర్ టీం ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక ఈ సినిమా కు అన్నీ కుదిరితే 2024 సంక్రాంతి కానుకగా RC 15 ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా చెప్పేశారు. మరికొన్ని రోజుల్లోనే మెగా అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందన్న మాట. ఈ వార్తను ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.