
దిల్ రాజ్ గురించి ఇండస్ట్రి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. దిల్ మూవీ తో ఆయన ఇంటిపేరుగా మూవీ నేమ్ పెట్టుకున్న ఘనత ఆయనదే. అయితే ఈయన గత 20 ఏళ్ల కాలంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నారు.. ఇక ఇండస్ట్రి కి గడిచిన 10 ఏళ్లలో ఒక సంవత్సర కాలంలో అత్యధిక మూవీస్ ని నిర్మించిన నిర్మాతలలో దిల్ రాజు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు.
ఈ మధ్య దిల్ రాజు మూవీస్ కి డైరక్షన్ కూడా చేయబోతున్నట్లు ఇండస్ట్రి లో ఒక టాక్ కూడా వినిపించింది. కానీ ఈ మాటల్లో ఎలాంటి నిజం లేదు అతనిది కేవలం ప్రొడక్షన్ వరకే డ్యూటీ అని తెలియజేశారు.ఇక అసలు విషయానికి వస్తే ఆయన రాజకీయాల్లో వస్తారా అనే మాటలు జోరుగా సాగుతున్నాయి. బలగం మూవీ ని ఇప్పటికే కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వీక్షించారు..
అయితే మరికొందరు రాజకీయ నాయకులు కూడా చూస్తామని అంటున్నారు. రాజకీయాల్లో మాకు తెలిసిన బంధువులు కూడా చాలామంది ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వస్తానా లేదా అనే విషయం ఇప్పట్లో తెలియదు అని చేప్పుకొచ్చారు. అయితే రాజకీయాల్లోకి రావడం రాకపోవడం అనేది కాలమే నిర్ణయిస్తుంది అని దిల్ రాజు వివరణ ఇచ్చారు.