PawanKalyan | పిఠాపురం నుంచే ఆంధ్రా భవిష్యత్ మారుస్తా:
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర లో ఆయన ఒక హాట్ టాపిక్. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయమని కొందరు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలని మరికొందరు ఆయన అభిమానులు కోరుతున్నారు.పవన్ కళ్యాణ్ మాత్రం నాకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. దత్తాత్రేయుడి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్రమైన నేలగా పేరుగాంచిన పిఠాపురం నుంచి పోటీకి నిలబడుతున్నాను.. అని జనసేన అధినేత స్పష్టం చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరదించారు.ఈ నేపద్యంలో మంగళవారం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్(PawanKalyan) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గమని.. అక్కడి నుండి పోటీ చేయడం నా అదృష్టమని అన్నారు. పిఠాపురం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పవన్ కళ్యాణ్(PawanKalyan) పిఠాపురం నుంచే ఏపీ దశ మారుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కీలకమైందన్నారు. పలువురు 2019 ఎన్నికల్లోనే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయమంటే ఆలోచించానని గుర్తు చేశారు. అయితే పిఠాపురాన్ని ఒక నియోజకవర్గంగా చూడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులాల ఐక్యత జరగాలని.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
ఇది ఇలా ఉండగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇందులో ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఫిక్స్ చేసిన పవన్.. ప్రస్తుతం మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ఫోకస్ పెట్టారు.(PawanKalyan)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb