Narendra Modi | భూటాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం:
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ కు చేరుకున్నారు.భూటాన్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధానికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. (Narendra Modi)
స్వాగతం అనంతరం పారో నుండి థింఫు వరకు మొత్తం 45 కిలో మీటర్ల పొడవున నిలబడిన ఆ దేశస్తులు ప్రధాని మోడీకి(Narendra Modi) ఘన స్వాగతం పలికారు.ఆ దారి గుండా ప్రధాని వెళ్లే ఓ మానవ గోడ కట్టినట్టు కనిపించింది. ఆ దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రధానిపై అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు.
రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోడీ హాజరుకానున్నారు.అయితే ఈ పర్యటనలో భాగంగా ఆ భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్యూక్ గ్యాల్పో’ను మోదీకి(Narendra Modi)అందజేయనున్నారు. ఈ అవార్డును మోడీకి 2021లోనే ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రధానికి రాలేదు. ఇప్పుడు ఆ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ చేతుల మీదుగా భారత ప్రధాని మోడీ స్వయంగా అందుకోనున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb