Megastar Chiranjeevi | చిరంజీవి దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే షాక్:
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్వయంకృషి సినిమా తో టాలీవుడ్ దిగ్గజ నటుడిగా ఎదిగి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. ఆయన ఇండస్ట్రి లో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ అయ్యారు.అయితే ఇండస్ట్రి లో ఎత్తుపల్లాలు, అవమానాలు ఎన్నో చూస్తూ ఎదిగిన ఆయనకు పర్సనల్ గా కార్లంటే చాలా ఇష్టమట. ఆయన కోట్ల రూపాయలు వెచ్చించి ఎప్పటికప్పుడు మార్కెట్ లోని అప్డేట్ కార్స్ కొంటూ తన గ్యారేజీ నింపేస్తుంటారు.
ఇప్పుడు చిరంజీవి గ్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి.మెగాస్టార్(Megastar Chiranjeevi) దగ్గర ప్రస్తుతం విదేశీ బ్రాండ్ కార్లతో పాటు రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ పేరుతో వచ్చిన ఈ ఎడిషన్ ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తీసుకున్నారు. ఈ కారు విలువ సుమారు 8 కోట్లు ఉంటుంది. బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఈ కారు ఉంది.
మెగాస్టార్ చిరంజీవి గ్యారేజ్‌లో రెండు టయోటా ట్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి. ఈ కార్లు ఎంతో లగ్జరీగా ఉంటాయి. ఈ కార్ల లో ఒకటి ఇండియా మార్కెట్ లోకి విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నారు చిరు. ఇవే కాకుండా చిరంజీవి దగ్గర మెర్సెడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారు ఉంది. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఆయన గ్యారేజ్ లో ఉంది. దాదాపు ఈ కారు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుంది. అలాగే రీసెంట్ గానే టయోటా వెల్ ఫైర్ కారు కొనుగోలు చేశారు చిరు..(Megastar Chiranjeevi)
దీని విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు. బ్లాక్ కలర్ లో ఈ కారు తీసుకున్న చిరంజీవి .. ఈ మధ్యే రిజిస్టార్టైన్ కూడా చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి 1111 నంబర్ సెంటిమెంట్ కాగా.. దాదాపు అన్ని కార్లకు అదే నంబర్ తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు చిరంజీవి దగ్గర ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని విలువ సుమారు 250 కోట్లు ఉంటుందట.ఈ లెక్కన చూస్తే కేవలం వాహనాలకే మెగాస్టార్ ఓ 300 కోట్ల మేర ఖర్చు పెట్టారని చెప్పుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మెగాస్టార్(Megastar Chiranjeevi) లగ్జరీ కార్లను ఈ కింది వీడియో చూడండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb