LPG Gas | మీ గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ తేదీ ఎలా చెక్ చేయాలో తెలుసా:
LPG Gas | పూర్వ కాలంలో వంట చేసుకోవడానికి కట్టెలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడున్నకాలంలో వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ తప్పని అయిపోయింది.. పాత రోజుల్లో అయితే కట్టెల పొయ్యిని ఉపయోగించేవారు. ప్రస్తుతం గ్రామాల్లో కూడా కట్టెల పొయ్యి వాడకం తగ్గిపోయింది. ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగం ఎలా ఉంది అంటే ఎప్పుడైన పిండి వంటల కోసం మాత్రమే కట్టెల పొయ్యిని వాడుతున్నారు. మిగతా అవసరాలన్నీటికి అందరు వంట కోసం గ్యాస్ నే వాడుతున్నారు. మరి మనం నిత్యం వాడే వంట గ్యాస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమంగా ఉండవచ్చు.. అయితే గ్యాస్ సిలిండర్ పై ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు.
ఈ ఎక్స్పైరీ డేట్ ను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..అయితే ప్రతీ సిలిండర్ (LPG Gas)పైన దాని ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. అయితే ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలి…. గడువు దాటిన సిలిండర్లలో లీకేజీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గడువు దాటిన సిలిండర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సిలిండర్ గడువు తెల్సుకోవాలి అంటే సిలిండర్ పైన భాగంలో గుండ్రటి హ్యాండిల్ లాంటిది పట్టుకునేందుకు ఉంటుంది. దాని కింది వైపుగా సిలిండర్‌కు సపోర్ట్ గా 3 ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లకు లోపలి వైపున చూసినపుడు నంబర్స్ ఉండడం కనిపిస్తుంది.
ఈ మూడు ప్లేట్లలో ఒక దాని మీద ఆ గ్యాస్ సిలిండర్(LPG Gas) యొక్క ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. అలా దానిపైన ఒక ఇంగ్లీష్ అక్షరం మరియు నంబర్ ముద్రించబడి ఉంటుంది. అయితే ఎంతో ఎవరికి సరిగా తెలీదు. అవి సంవత్సరం మరియు నెలకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది. మీ ఇంట్లో ఉన్న సిలిండర్ పైన A 23 అని ఉంటే జనవరి నుండి మార్చి, 2023 వరకు అర్ధం. మార్చి ఆ సిలిండర్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలా సిలిండర్ పై B అని ఉంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు, C అని ఉంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు, D అని ఉంటే అక్టోబర్ నుండి డిసెంబర్ నెల వరకు అని అర్థం.
ఇక దానిపై ఉండే నంబర్ అనేది సంవత్సరాన్ని తెలుపుతుంది. ముఖ్యంగా మీరు గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చిన వెంటనే, దాని ఎక్స్పైరీ తేదీని చెక్ చేసుకొని తీసుకోవాలి. లేదంటే గడువు దాటిన సిలిండర్ లీకేజీల వల్ల పేలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సిలిండర్(LPG Gas) కి సీల్ ను కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎలాంటి క్రాక్స్ ఉండకూడదని రూల్స్ చెబుతున్నాయి. విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.