ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?

హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) ఈఎన్‌సీ (చీఫ్ ఇంజినీర్) మోహన్ నాయక్ ఇల్లు, ఆయనకు సంబంధించిన కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో ఈ సోదాలు ప్రారంభమయ్యాయి.

ఉద్యోగం వదిలేశాక ….స్వేచ్ఛ 11 నిమిషాల తర్వాత మాయమైంది.

హైదరాబాద్‌లోని వసంత సిటీలో ఉన్న ఆయన నివాసంతో పాటు తెలంగాణవ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కీలకమైన పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ తినొచ్చా? నిపుణులు చెబుతున్న ముఖ్య సూచనలు

పదవిని అడ్డం పెట్టుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడి మోహన్ నాయక్ వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.200 కోట్ల వరకు అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తనిఖీలు రోజంతా కొనసాగే అవకాశం ఉందని, సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *