ఉద్యోగం వదిలేశాక ….స్వేచ్ఛ 11 నిమిషాల తర్వాత మాయమైంది.

ఉద్యోగం వదిలేశాక ….స్వేచ్ఛ 11 నిమిషాల తర్వాత మాయమైంది.

ఉద్యోగం వదిలేసి సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే పూర్తిస్థాయి స్వేచ్ఛ వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ ఆ స్వేచ్ఛ కేవలం 11 నిమిషాలకే పరిమితమవుతుందని, ఆ తర్వాత అసలైన ఒత్తిడి మొదలవుతుందని ఓ యువ ఆంట్రప్రెన్యూర్ పంచుకున్న అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజిటల్ క్రియేటర్ Mehul Agarwal తన 9 టు 5 ఉద్యోగాన్ని వదిలిన తర్వాత ఎదురైన వాస్తవాలను ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

“ఉద్యోగం మానేసి నీకే నువ్వు బాస్ అవ్వమని అందరూ చెబుతారు. కానీ ఆ స్వేచ్ఛ ఎక్కువసేపు నిలవదు” అంటూ ఆయన పేర్కొన్నారు. ల్యాప్‌టాప్ తెరిచిన వెంటనే అన్ని బాధ్యతలు తన భుజాలపై పడిన భావన కలిగిందని చెప్పారు. ఉద్యోగంలో బాస్ ఎక్కువ పని ఇస్తున్నాడని అనుకునేవాడినని, ఇప్పుడు బాస్ లేకపోయినా పనిభారం మాత్రం మరింత పెరిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.

రోజూ ఖాళీ కడుపుతో నెయ్యి తింటే ఏమవుతుంది?

ఉద్యోగం మానేసిన మొదటి రోజు ఎంతో ఉత్సాహంగా మూడు నెలల ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని, రెండో రోజు కూడా అదే పనిలో గడిచిందని తెలిపారు. అయితే మూడో రోజు వచ్చేసరికి ఆత్మవిశ్వాసం తగ్గిపోయి, తాను తీసుకున్న నిర్ణయాలపై సందేహాలు మొదలయ్యాయని వెల్లడించారు.

అయినా కూడా తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. తనకు ఇష్టమైన పనిని నిర్మించుకోవాలనే లక్ష్యంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పారు. విజయాలు, వైఫల్యాలు రెండింటినీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో స్టార్టప్‌లు ప్రారంభించాలని భావిస్తున్న యువతకు వాస్తవ పరిస్థితులను చూపించే సందేశంగా మారింది.

మల్టీలెవల్ మార్కెటింగ్ ట్రాప్..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *