ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు Raghava Lawrence రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నటుడు Vijay నేతృత్వంలోని టీవీకే పార్టీ తరఫున తిరుచి ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాను తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం “బెంచ్” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, జూన్ 10తో ఆ షెడ్యూల్ పూర్తవుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ
అనంతరం తన తల్లి ఆశీస్సులతో జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని జూన్ 11 గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన చేయబోయే ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
సినిమాలతో పాటు తన సేవా కార్యక్రమాల ద్వారా అనాథలు, వృద్ధులకు అండగా నిలుస్తూ ప్రజాదరణ పొందిన లారెన్స్, రాజకీయాల్లోకి వస్తారా? లేక కొత్త సామాజిక సేవా కార్యక్రమాన్ని ప్రకటిస్తారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే జూన్ 11 వరకు వేచి చూడాల్సిందే.
రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే కంటి సమస్యలు తగ్గుతాయి.

