అచ్చం మగవారి గొంతుతో ఎస్. జానకి పాట! ఇంటర్వ్యూ విశేషాలు

అచ్చం మగవారి గొంతుతో ఎస్. జానకి పాట! ఇంటర్వ్యూ విశేషాలు

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయని ఎస్. జానకి (S. Janaki) స్థానం అద్వితీయం. ఆమె కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ‘సాక్షి టీవీ ఫ్లాష్‌బ్యాక్’ (Sakshi TV FlashBack) ఇంటర్వ్యూలో ఆమె తన సంగీత ప్రయాణం గురించి మరియు పాటల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సంగీత దర్శకత్వం మరియు ప్రైవేట్ ఆల్బమ్స్:

మీరు సంగీత దర్శకత్వాన్ని ఎందుకు కొనసాగించలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు జానకి గారు సమాధానమిస్తూ.. తాను కేవలం ‘మౌనపోరాటం’ సినిమాకు మాత్రమే సంగీత దర్శకత్వం వహించానని చెప్పారు. అంతకుముందు కూడా చాలా మంది అడిగినప్పటికీ తాను ఒప్పుకోలేదని, కానీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కోరడంతో సరదాగా చేశానని వివరించారు . అలాగే కొన్ని ప్రైవేట్ క్యాసెట్స్, భక్తి పాటల ఆల్బమ్స్ కూడా చేశానని తెలిపారు.

మలబద్ధకం చిన్న సమస్య కాదు.. గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం

సింగర్ చిత్ర నా భక్తురాలు:

స్టేజ్ షోలలో తన పాటలను వేరే సింగర్స్ పాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని జానకి గారు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రముఖ సింగర్ చిత్ర (Singer Chitra) గురించి మాట్లాడుతూ.. ఆమె చిన్నప్పటి నుంచి నా అభిమాని మాత్రమే కాదు, నా భక్తురాలు అని కూడా చెప్పవచ్చని, నాపై ఆమెకు అంత పిచ్చి ప్రేమ ఉందని గుర్తుచేసుకున్నారు.

అనేక భాషల్లో పాటలు – జర్మన్, పంజాబీ ఎక్స్‌పెక్ట్‌మెంట్స్:

ప్రేమ వివాహం విషాదాంతం.. నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు.

జానకి గారు కేవలం సౌత్ ఇండియన్ భాషలే కాకుండా ఒరియా, బెంగాలీ, కొంకణి, తులు, సౌరాష్ట్ర, సింహళీస్ వంటి అనేక భాషల్లో పాటలు పాడారు. ఒక మలయాళం సినిమాలో పూర్తి పంజాబీ పాటను కూడా ఆమె పాడటం విశేషం. అలాగే జర్మన్ లాంగ్వేజ్‌లో మరియు తెలుగు సినిమా ‘స్వయంకృషి’ లో ఇంగ్లీష్ సాంగ్ కూడా పాడారు.

మగవారి గొంతుతో పాట – ఇళయరాజా ప్రయోగాలు:

ఈ ఇంటర్వ్యూలో జానకి గారు అచ్చం మగవారి గొంతుతో పాడిన ఒక తమిళ పాటను పాడి వినిపించారు . 16-17 ఏళ్ల అబ్బాయి గొంతు మారే సమయంలో వచ్చే బేస్ వాయిస్‌తో ఈ పాటను పాడాల్సి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) తన వాయిస్‌తో ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశారని ఆమె చెప్పారు. రికార్డింగ్‌కి వెళ్లే వరకు అది ఎలాంటి పాట అనేది తనకు తెలియదని, ఒక మగవారి గొంతుతో తాను ఎలా పాడగలనని అడిగితే, ఇళయరాజా ఖచ్చితంగా మీరే పాడాలని పట్టుబట్టారని జానకి గారు గుర్తుచేసుకున్నారు.

ఆ గొంతుతో పాడటం వల్ల వాయిస్ పాడవుతుందని, ఆ తర్వాత వేరే రికార్డింగ్స్ కూడా ఉండటంతో ఇళయరాజాతో చిన్నపాటి గొడవలు కూడా అయ్యేవని ఆమె నవ్వుతూ పంచుకున్నారు.

టాలీవుడ్ డాన్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఉద్రిక్తత

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *