కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.

దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు.

రాబోయే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 75 లక్షల ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 25 లక్షల ఇళ్లలో సోలార్ వ్యవస్థలను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం కోటి ఇళ్లకు ఈ సదుపాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.

జుట్టు రాలడానికి ప్రధాన కారణం పోషకాహార లోపమే: నేచురోపతి వైద్యురాలు డాక్టర్ షాగుప్త.

2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.75,000 కోట్ల నిధులను కేటాయించింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకునే వారికి ఆకర్షణీయమైన సబ్సిడీ కూడా అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ వ్యవస్థలకు 60 శాతం వరకు, 2 నుంచి 3 కిలోవాట్ల మధ్య సామర్థ్యం గల వ్యవస్థలకు 40 శాతం వరకు సబ్సిడీ అందజేస్తోంది.

ఈ పథకానికి పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా అర్హులుగా ఉంటాయి. సోలార్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉద్యోగం వదిలేశాక ….స్వేచ్ఛ 11 నిమిషాల తర్వాత మాయమైంది.

అర్హులైన వినియోగదారులు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు సమయంలో మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, విద్యుత్ కనెక్షన్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఆహారం, జీవనశైలి కీలకం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *