దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాలను వ్యతిరేకిస్తూ All India Organisation of Chemists and Druggists బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. తెలంగాణలోనే దాదాపు 48 వేల ఫార్మసీలు బంద్‌లో పాల్గొంటున్నాయి.
ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లతో చిన్న మెడికల్ షాపులపై ప్రభావం చూపుతున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
షుగర్ పూర్తిగా కంట్రోల్…7 రోజుల్లో బ్లడ్ షుగర్ నార్మల్.
అదేవిధంగా నకిలీ మందుల విక్రయాలు, నార్కోటిక్ మరియు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఆన్‌లైన్ ద్వారా సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో యువత దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కరోనా సమయంలో ప్రారంభమైన హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, కాబట్టి ఆన్‌లైన్ మందుల అమ్మకాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో నిరవధిక బంద్‌కు కూడా సిద్ధమవుతామని ఫార్మసీ సంఘాలు హెచ్చరించాయి.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..ఫ్యాటీ లివర్ తగ్గించే డ్రింక్.