Jr. NTR కెరీర్ ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల Hrithik Roshan తో కలిసి నటించిన స్పై యాక్షన్ చిత్రం “వార్ 2”పై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తారక్ చేయాల్సిన పలు ప్రాజెక్టులపై అనేక రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా “దేవర” సీక్వెల్‌పై అనిశ్చితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే హిందీలో ప్లాన్ చేసిన మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో Trivikram Srinivas దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందన్న వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
వడదెబ్బ తగలకుండా చూసుకోవాలనుకుంటున్నారా? మీ బాడి ని కూల్ చేసే ఫుడ్స్ ఇవే.
“అరవింద సమేత వీరరాఘవ” తర్వాత ఎన్టీఆర్–త్రివిక్రం కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడినా, అనేక కారణాల వల్ల ముందుకు సాగలేదు. ఆ తరువాత తారక్ Koratala Siva దర్శకత్వంలో “దేవర” చిత్రానికి కమిట్ అయ్యారు. ఆ సినిమా సౌత్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, నార్త్ మార్కెట్‌లో మంచి వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఇక త్రివిక్రం–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ సినిమా రూపొందబోతుందన్న ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎవరూ చూపించని కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని నిర్మాత నాగవంశి కూడా పలు సందర్భాల్లో చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..ఫ్యాటీ లివర్ తగ్గించే డ్రింక్.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ మైథలాజికల్ కథ ఇప్పుడు Allu Arjun వద్దకు వెళ్లిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. “అల వైకుంఠపురంలో” తర్వాత త్రివిక్రం–బన్నీ కాంబినేషన్‌లో మరో సినిమా రావాల్సి ఉండగా, మధ్యలో ఇతర ప్రాజెక్టులు రావడంతో ఆలస్యం జరిగింది. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్ Prashanth Neel దర్శకత్వంలో తెరకెక్కుతున్న “డ్రాగన్” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.