భారత్ బంద్కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన.

భారత్ బంద్కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన.

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో పలు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా, ఒడిశాలో కూడా ఉదయం నుంచే సమ్మె వాతావరణం నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రభావం మోస్తరు స్థాయిలోనే ఉంది.

10కి పైగా కేంద్ర కార్మిక, రైతు సంఘాలు ఇచ్చిన ఈ పిలుపులో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశముందని నేతలు తెలిపారు. రవాణా, బ్యాంకింగ్, భీమా రంగాల్లో పాక్షిక అంతరాయం ఏర్పడింది. భీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి, కొత్త లేబర్ కోడ్ల అమలు వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. అయితే అత్యవసర సేవలపై పెద్దగా ప్రభావం లేదు.

కంటి చూపును డ్యామేజ్ అవ్వకుండా కాపాడే డ్రింక్ ఇది.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మెకు మద్దతుగా సైరన్ మోగించగా, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. లేబర్ కోర్టులను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సింగరేణిలో బిఎంఎస్ మినహా ఇతర కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడలో సాధారణ జీవనం పెద్దగా ప్రభావితం కాలేదు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు యథావిధిగా నడిచాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిమిత నిరసనలు మాత్రమే కనిపించాయి. అయితే సమ్మె నేపథ్యంలో కాకినాడ పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు.

అన్నమయ్య జిల్లాలో ‘పుష్ప’ సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ పర్యాటక ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బొర్రా గుహలు, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం ప్రాంతాల్లో కార్మికులు నిరసనలు చేపట్టగా, అరకులోయలో పలు వ్యాపారాలు మూతపడ్డాయి. రాజమండ్రి, తిరుపతిలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీలు నిర్వహించి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది.

ఇంట్లో పిల్లలకి అమ్మవారు పోస్తే పాటించవలసిన నియమాలు ఏమిటి?

సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *