గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా ఎక్కువమంది ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్‌నే ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ డెస్క్‌టాప్ యూజర్లకు హై రిస్క్ అలర్ట్ ప్రకటించింది.
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని గుర్తించారు. ఈ లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీ, డేటా సెక్యూరిటీకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
గ్లాస్ వాటర్ తాగినా మూత్రం వచ్చేస్తుందా?
అందువల్ల, యూజర్లు తాజా వెర్షన్‌కు బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలని, తద్వారా సైబర్ దాడుల నుంచి రక్షించుకోవచ్చని కేంద్రం సూచించింది.
Reduces Skin Infections | మొండి చర్మ వ్యాధులను సైతం తగ్గించే ఈ జ్యూస్ ఎలా తయారు చేస్కోవాలో చూడండి.