త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు.. ఏపీలో మూడో స్థానమే లక్ష్యం: విజయసాయి రెడ్డి

1280X720 3 1

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీకి రంగం సిద్ధమవుతోందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన ఆయన.. తమ పార్టీ అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఏ ఒక్క సామాజిక వర్గానికో, మతానికో పరిమితం కాకుండా ప్రజలందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

రాజకీయాల్లో పార్టీ మనుగడ సాధించాలంటే అన్ని వర్గాల ప్రజల మద్దతు అవసరమని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీల విధానాలపై ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మకంగా స్పందిస్తామని తెలిపారు.

ALSO READ: పిల్లలు మొలకలు తినడం లేదా? ఇలా చేస్తే ఇష్టంగా తినే అవకాశం!

image 3

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉన్నాయని పేర్కొన్న విజయసాయి రెడ్డి.. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ మూడో స్థానంలో నిలుస్తుందని అన్నారు. అక్కడి నుంచి రెండో స్థానానికి, ఆ తర్వాత మొదటి స్థానానికి ఎదిగేలా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా తిరుమల లడ్డూ వ్యవహారంపై కూడా విజయసాయి రెడ్డి స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో నాణ్యతకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చని, అయితే జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి ధరపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్ ధర కిలోకు రూ.1,000కు పైగా ఉంటే, ప్రభుత్వం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న నెయ్యి నాణ్యతపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.

ALSO READ: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 15 తులాల బంగారం మాయం.

Related Post