సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల బ్యాగుల్లో ఉన్న సుమారు 15 తులాల బంగారం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితులు తెలిపారు.
బాధితుల వివరాల ప్రకారం.. కోదాడ నుంచి హుజూర్‌నగర్‌కు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో అమృత హాస్పిటల్ సమీపంలో బస్సు ఎక్కినట్లు వారు తెలిపారు. తమ వెంట తీసుకెళ్తున్న బ్యాగుల్లో బంగారు ఆభరణాలు ఉన్నాయని, హుజూర్నగర్ బస్‌స్టాండ్‌కు చేరుకున్న తర్వాత బ్యాగులను పరిశీలించగా రెండు బ్యాగులు కోసి ఉండటాన్ని గుర్తించినట్లు చెప్పారు.
ALSO READ: The Paradise Movie Review: నాని మాస్ అవతార్ ఎలా ఉంది? కథ, నటన, ప్లస్‌లు, మైనస్‌లు 2026.
బ్యాగుల్లో ఉన్న సుమారు 15 తులాల బంగారం కనిపించకపోవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో ప్రయాణించిన వారిని, మార్గమధ్యంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తూ దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ALSO READ: అధిక నెలసరి రక్తస్రావం తగ్గించుకోవచ్చా? 25% Sperm Count ని రెండు వారాల్లో పెంచే పొడి ఇది.
