చీరలోనే 1600 మీటర్లు.. చెప్పులు లేకుండా పరుగెత్తిన జార్ఖండ్ మహిళ.

1280X720 3 3

లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే పేదరికం కూడా అడ్డంకి కాదని జార్ఖండ్‌కు చెందిన కవితా కుమారి నిరూపించింది. షూస్‌ లేకపోయినా, ట్రాక్‌ సూట్‌ లేకపోయినా.. కనీసం చెప్పులు కూడా లేకుండానే చీర ధరించి 1600 మీటర్ల పరుగును పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంది.

రామ్‌గఢ్‌ జిల్లాలోని దుర్మి బ్లాక్‌ పరిధి సోసో గ్రామానికి చెందిన కవిత భర్తను కోల్పోయింది. ఇద్దరు పిల్లలతో పాటు అత్తమామల బాధ్యత కూడా ఆమెపైనే ఉంది. కుటుంబాన్ని పోషించడంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో హోమ్‌గార్డ్‌ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.

ALSO READ: ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే.. యాంటీఆక్సిడెంట్ ఆహారాలు ఇవే

హోమ్‌గార్డ్‌ నియామకానికి నిర్వహించిన ఫిజికల్‌ టెస్ట్‌లో భాగంగా 1600 మీటర్ల పరుగులో పాల్గొన్న కవిత.. నిర్ణయించిన 10 నిమిషాల గడువు కంటే ముందే కేవలం ఆరు నిమిషాల్లో పరుగును పూర్తి చేసింది. మండుటెండలో కూడా చెప్పులు లేకుండా చీరతోనే ఆమె పరుగెత్తడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

image 4

ఆర్థిక ఇబ్బందుల కారణంగా రన్నింగ్‌ షూస్‌, ట్రాక్‌ సూట్‌ కొనుగోలు చేయలేకపోయానని కవిత తెలిపింది. అయినప్పటికీ లక్ష్యాన్ని వదులుకోకుండా ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి పరుగులో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది.

ప్రస్తుతం కవిత ఇటుక బట్టీలో పనిచేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. హోమ్‌గార్డ్‌ ఉద్యోగం లభిస్తే కుటుంబానికి స్థిరమైన ఆదాయం వస్తుందని, తన పిల్లలను బాగా చదివించగలనని ఆశిస్తోంది.

ALSO READ: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 15 తులాల బంగారం మాయం.

ఈ నియామక ప్రక్రియలో 284 హోమ్‌గార్డ్‌ పోస్టులు ఉండగా, మహిళలకు ప్రత్యేకంగా అవకాశాలు కేటాయించినట్లు సమాచారం. కవిత పరుగు తీస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నవంబర్‌లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండటంతో కవిత ఉద్యోగం కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

Related Post